మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్ ‘ఎల్ మెంచో’ హతం

` స్పెషల్ ఆపరేషన్‌లో మట్టుబెట్టిన మెక్సికో ఆర్మీ
` నిరసనగా మెక్సికోలో చెలరేగిన హింసాకాండ
` ఆ దేశంలోని భారతీయులకు అడ్వైజరీ
మెక్సికోసిటీ(జనంసాక్షి):మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో ఒసెగుయెరా అలియాస్ ‘ఎల్ మెంచో’ హతమయ్యాడు. ఆదివారం జరిగిన ఆపరేషన్‌లో అతడిని మట్టుబెట్టినట్లు మెక్సికో ఆర్మీ వెల్లడించింది. దీంతో ఆ దేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి.59 ఏళ్ల ఎల్ మెంచోను పట్టుకోవడం కోసం మెక్సికో సైన్యం నిన్న ఆపరేషన్ చేపట్టింది. అమెరికా నిఘా వర్గాల సమాచారంతో జాలిస్కో రాష్ట్రంలోని తపాల్ప పట్టణంలో అతడు నక్కిన ప్రాంతాన్ని చుట్టుముట్టి సోదాలు చేపట్టింది. ఈ క్రమంలోనే మెంచో అనుచరులు కాల్పులు జరపగా.. సైన్యం ఎదురుదాడి చేసింది. ఈ భీకర ఆపరేషన్‌లో మెంచో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని పట్టుకుని ఆసుపత్రికి తరలిస్తుండగా మతిచెందినట్లు మెక్సికో సైన్యం వెల్లడించింది.ఎల్ మెంచోతో పాటు అతడి ముఠాకు చెందిన మరో ఆరుగురు ఈ ఆపరేషన్‌లో మరణించినట్లు అక్కడి సైన్యం తెలిపింది. ఈ ఘటనతో మెక్సికోలోని పలు రాష్టాల్లో హింసాత్మక ఆందోళనలు చెలరేగాయి. మాఫియా డాన్ అనుచరులు పలు ప్రాంతాల్లో వాహనాలను తగలబెట్టారు. రహదారులను దిగ్బంధించారు. సూపర్ మార్కెట్లు, బ్యాంకులను తగలబెట్టారు.ఎల్ మెంచో 2009లో జాలిస్కో న్యూజనరేషన్ కార్టెల్ అనే మాదకద్రవ్యాల ముఠాను ఏర్పాటు చేశాడు. గత దశాబ్ద కాలంలో మెక్సికోలో అత్యంత శక్తిమంతమైన నేర సిండికేట్‌గా మారాడు. అమెరికాకు ప్రధాన డ్రగ్స్ అక్రమ రవాణాదారుగా ఎదిగాడు. జాలిస్కో కార్టెల్‌ను అగ్రరాజ్యం ఉగ్ర సంస్థగా పరిగణించింది. మెంచో తలపై 15 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.136 కోట్లు) రివార్డు ప్రకటించింది. తాజా పరిణామాలపై వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ స్పందించారు. “ఎల్ మెంచోను పట్టుకోవడం కోసం మెక్సికో ప్రభుత్వానికి అమెరికా ఇంటెలిజెన్స్ సహకారం అందించింది. అతడు మా దేశానికి ఫెంటనిల్‌ను అక్రమంగా తరలిస్తున్నాడు. ఇలాంటి నార్కో టెర్రిరిస్ట్‌లను అగ్రరాజ్యం ఎన్నటికీ సహించబోదు” అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
భారత్ అడ్వైజరీ..
మెక్సికోలో అల్లర్ల నేపథ్యంలో అక్కడి భారత పౌరులకు మన ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుత హింసాత్మక పరిస్థితుల దష్ట్యా మెక్సికోలోని భారత పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు షెల్టర్లలోకి వెళ్లిపోవాలని పేర్కొంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, స్థానిక అధికారుల అప్‌డేట్లను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని తెలిపింది. సాయం కోసం ఎంబసీని సంప్రదించాలని సూచించింది.
పోలీసు నుంచి డ్రగ్ డాన్‌గా..
డ్రగ్ మాఫియా కింగ్, కరడుగట్టిన నేరస్థుడు ‘ఎల్ మెంచో’ మతితో మెక్సికో అట్టుడుకుతోంది. తమ నాయకుడిని చంపేశారన్న కోపంతో అతడి ముఠా సభ్యులు హింసకు దిగారు. దుకాణాలకు నిప్పంటించడం, వాహనాలను దగ్ధం చేయడం వంటి ఘటనలతో మెక్సికో (ఓవలీతిఞనీ) అల్లకల్లోలంగా మారింది. ఇంతకీ ఎవరీ ‘ఎల్ మెంచో ఎల్ మెంచో అసలు పేరు నెమెసియో ఒసెగుయెరా సెర్వాంటెస్. 1966లో మిచోకాన్‌లోని ఓ మారుమూల గ్రామంలో పుట్టాడు. ఈ ప్రాంతంలో అవకాడోతో పాటు గంజాయి, నల్లమందు వంటివి ఎక్కువగా సాగు చేస్తుంటారు. చిన్నతనంలో అవకాడో పొలాల్లో పనిచేసిన మెంచో.. ఆ తర్వాత 1980ల్లో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించాడు. కాలిఫోర్నియాలో హెరాయిన్ సరఫరా చేస్తూ అగ్రరాజ్య పోలీసులకు దొరికిపోయాడు. కొన్నేళ్ల పాటు జైలుశిక్ష అనుభవించిన అనంతరం అతడిని అమెరికా యంత్రాంగం మెక్సికోకు అప్పగించింది. స్వదేశానికి వచ్చిన తర్వాత కొంతకాలం పాటు పోలీసుగా పనిచేశాడు. ఆ సమయంలో డ్రగ్ మాఫియా కాంటాక్టులు తెలుసుకుని మాదకద్రవ్యాల అక్రమ రవాణా వ్యాపారంలోకి అడుగుపెట్టాడు.
మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్ హతం.. మెక్సికోలో భారతీయులకు అడ్వైజరీ
రక్త చరిత్రతో నేర సామ్రాజ్యం..
తొలుత మెక్సికోలో శక్తిమంతమైన సినావోలా డ్రగ్ కార్టెల్‌కు చెందిన ముఠాలో పనిచేశాడు. కొన్నేళ్ల తర్వాత అక్కడి నుంచి బయటకువచ్చి 2009లో సొంతంగా జాలిస్కో న్యూజనరేషన్ కార్టెల్‌ను ఏర్పాటు చేశాడు. ఈ ముఠా గత కొన్నేళ్లుగా అమెరికాకు ఫెంటనిల్ వంటి ప్రమాదకర మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తోంది. డ్రగ్ సరఫరా ఒక్కటే కాదు.. ఈ ముఠా దోపిడీలు, కిడ్నాప్‌లు, హత్యల వంటి అనేక నేరాలకు పాల్పడింది. 2015లో కేవలం ఆరు వారాల వ్యవధిలోనే 20 మందికి పైగా పోలీసులను తలలు నరికి అత్యంత దారుణమైన రీతిలో చంపేసింది.
కన్పించకుండానే భయపెడుతూ..
డ్రగ్ కింగ్‌పిన్ ‘ఎల్ చాపో’ తర్వాత మెక్సికోలో అత్యంత శక్తిమంతమైన క్రిమినల్ బాస్‌గా ‘ఎల్ మెంచో’ మారాడు. అయితే, చాపో తరహాలో విÖడియా సెలబ్రిటీ కాకుండా.. అజ్ఞాతంలో ఉంటూ తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఎక్కువగా గ్రావిÖణ ప్రాంతాల్లో దాక్కొనేవాడు. గతంలో రెండుసార్లు అతడిని పట్టుకునేందుకు మెక్సికో దళాలు ప్రయత్నించగా.. చిక్కినట్లే చిక్కి చేజారిపోయాడు. సామాజిక మాధ్యమాల్లో వీడియోలు విడుదల చేస్తూ అధికారులు, శత్రువులను భయపెట్టేవాడు. రాజకీయంగానూ అతడికి అండదండలు ఉన్నట్లు సమాచారం. ఎల్ మెంచో కుటుంబ సభ్యులు కూడా అతడి నేర ముఠాలో భాగమే. అతడి భార్య రోజాలిండా వాలెన్సియా కార్టెల్ ఆర్థిక నెట్‌వర్క్‌ను చూస్తోంది. కుమారుడు అమెరికాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో జీవితఖైదు అనుభవిస్తున్నాడు.
ఎల్ మెంచోను పట్టుకునేందుకు మెక్సికో ఆర్మీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. తాజాగా అమెరికా ఇంటెలిజెన్స్ సహకారంతో అతడి ఆచూకీని గుర్తించి చుట్టుముట్టారు. ఈ క్రమంలో జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మెంచో ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. అతడిపై 15 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.136 కోట్లు) రివార్డు ఉంది.
అన్నింటా మాదే విజయం :ట్రంప్
వాషింగ్టన్(జనంసాక్షి):మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో ఒసెగుయెరా అలియాస్ ‘ఎల్ మెంచో’ను హతమార్చిన ఘనతను సొంతం చేసుకోవడం కోసం అమెరికా, మెక్సికో పోటీపడుతున్నాయి. ఆదివారం జరిగిన ఆపరేషన్‌లో ఎల్ మెంచో మరణించిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికా అధ్యక్షుడు స్పందిస్తూ..“అన్ని విషయాల్లోనూ మేమే గెలుస్తున్నాం. ఈ విధంగా అన్నింటిలో విజయం సాధించడం కూడా న్యాయం కాదు’ అంటూ సోషల్ విÖడియాలో సరదాగా పోస్ట్ చేశారు. అమెరికా నిఘా వర్గాల సమాచారంతోనే డ్రగ్ మాఫియా డాన్ ‘ఎల్ మెంచో’ను మెక్సికో సైన్యం హతమార్చినట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ పేర్కొన్న అనంతరం ట్రంప్ ఈ పోస్ట్ చేశారు. అమెరికాకు మాదకద్రవ్యాలను సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు అమలయ్యేలా ట్రంప్ యంత్రాంగం చర్యలు చేపట్టిందని కరోలిన్ లీవిట్ తెలిపారు. అందులో భాగంగానే మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషించిన ఎల్ మెంచోను పట్టుకోవడం కోసం మెక్సికో (ఓవలీతిఞనీ) ప్రభుత్వానికి అమెరికా ఇంటెలిజెన్స్ సహకారం అందించిందన్నారు. అయితే అమెరికా నిఘా వర్గాల సమాచారం మేరకు ఈ ఆపరేషన్‌ను నిర్వహించినట్లు వస్తున్న వార్తలను వాషింగ్టన్‌లోని మెక్సికో రాయబార కార్యాలయం తోసిపుచ్చింది. డ్రగ్ మాఫియా డాన్‌ను బంధించడానికి చేపట్టిన ఆపరేషన్‌ను మెక్సికన్ ప్రత్యేక దళాలు ప్లాన్ చేసి నిర్వహించాయని తెలిపింది. ఈ విషయంలో అగ్రరాజ్యం కొంత సమాచారం (కాంప్లిమెంటరీ ఇంటెలిజెన్స్) మాత్రమే అందించిందని వెల్లడించింది. ఇదీ చదవండి: మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్ హతం.. మెక్సికోలో భారతీయులకు అడ్వైజరీ