ఇనుప సామగ్రి దొంగతనం కేసులో ఆరుగురి కి రిమాండ్

గంభీరావుపేటఫిబ్రవరి 24(జనం సాక్షి):గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామ
శివారులో ఉన్న ఎం ఆర్ కే ఆర్ కంపనీకు చెందిన ఇనుప పైపులు, తలుపులు మరియు ఇతర ఇనుప సామగ్రిని అక్రమంగా అపహరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి సుమారు రూ.1 లక్షల విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కార్తిక్ రెడ్డి, మాధవ్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, పంగా బాలకృష్ణ, సయ్యద్ అల్తాఫ్, మనోహర్ రెడ్డి అనే ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు కంపెనీ ప్రాంగణంలో నిల్వ ఉంచిన ఇనుప సామగ్రిని రాత్రివేళల్లో దొంగతనం చేసి, అమ్మకానికి ప్రయత్నించినట్లు విచారణలో వెల్లడైంది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి దొంగిలించిన ఇనుప పైపులు, తలుపులు మరియు ఇతర ఇనుప వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఎస్సై అనీల్ కుమార్ కేసు నమోదు చేసి, నిందితులను రిమాండ్కు తరలించినట్లు ట్రాక్టర్ బైక్ గ్యాస్ కట్టర్ మరియు ఐరన్ మెటీరియల్ నీ సీజ్ చేసినట్టు తెలిపారు. ఇలాంటి చోరీలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.



