ఇక మెట్రో బాధ్యత తెలంగాణ సర్కారుదే..

` ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
` ఈ ప్రక్రియ పర్యవేక్షణకు భట్టి ఆధ్వర్యంలో ఉపసంఘం
` మార్చి 31లోగా కార్యాచరణ పూర్తికి నిర్ణయం
` డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా వైద్యవిధాన పరిషత్
` ఖమ్మం జిల్లాలో టీటీడీ నిర్మాణాలకు 20 ఎకరాలు
` మహబూబాబాద్ జిల్లా గుమ్మడూరులో జేఎన్‌టీయూకు 70 ఎకరాలు
` అన్ని జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ కార్యాలయాలకు భూ కేటాయింపులు
` అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా జనగణన నిర్వహించేందుకు ఆమోదం
` మార్చి 16 నుంచి 30 వరకు అసెంబ్లీ సమావేశాలు
` తెలంగాణ కేబినేట్ కీలక నిర్ణయాలు
హైదరాబాద్,ఫిబ్రవరి23(జనంసాక్షి): హైదరాబాద్ మెట్రో రైలును ఎల్ అండ్ టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే దీనిపై ప్రకటన విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. స్వాధీనం చేసుకునే పక్రియను పర్యవేక్షించడానికి మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతత్వంలోని ఈ కమిటీలో.. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, జూపల్లి కష్ణారావు సభ్యులుగా ఉంటారు.. ఇకపోతే మార్చి 16 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. 30 వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించిన గవర్నర్ ప్రసంగం ఉంటుంది. 20న బడ్జెట్ ప్రవే శ పెడతారు. దీనికి కేబినేట్ ఆమోదం తెలిపింది. ఇకపోతే మెట్రోకు సంబంధించ గత ఏడాది సూతప్రాయంగా జరిగిన ఒప్పందంలో రూ.2 వేల కోట్ల ఈక్విటీని ఏకమొత్తంగా ఎలఅండ్‌టీకి చెల్లించేలా.. రూ.13 వేల కోట్ల రుణాలను ప్రభుత్వం బదలాయించుకునేలా అవగాహనకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతే స్వాధీన పక్రియ మొదలైంది. మెట్రో ఆస్తులు, వాటి విలువను ఐడీబీఐ క్యాపిటల్.. రైళ్లు, ట్రాక్‌లు, సిగ్నలింగ్ వ్యవస్థ వంటి సాంకేతిక అంశాలపై డీఎంఆర్‌సీ మదింపు చేసి ప్రాథమిక నివేదికలిచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చర్చించారు. హైదరాబాద్ మెట్రోపై తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోని నిర్వహిస్తున్న ఎలఅండ్‌టీ నుంచి పూర్తిగా ప్రభుత్వాధీనంలోకి తీసుకునేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ప్రకారం మార్చి 31వ తేదీలోపు మెట్రోను పూర్తిగా స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఈ టేకోవర్ మొత్తం విలువ సుమారు రూ.15,000 కోట్లుగా అంచనా వేసింది. ఇందులో మెట్రోపై ఉన్న అప్ప్పులు రూ.13,000 కోట్లు కాగా, ఎల్ అండ్‌టీ సంస్థ ఈక్విటీ వాటా రూ.2,000 కోట్లుగా ఉంది. మెట్రో రెండో దశ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలంటే మొదటి దశ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని కేంద్ర ప్రభుత్వం షరతు విధించింది. ఈ నేపథ్యంలోనే మెట్రోను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో హైదరాబాద్ మెట్రో విస్తరణకు మార్గం సుగమం కానుంది. నగరంలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో వచ్చిన తర్వాత.. మెట్రో విస్తరణ వేగవంతం అవుతుంది. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంటుంది. రవాణా వ్యవస్థపై ప్రభుత్వానికి పూర్తి నియంత్రణ ఉంటుంది. భవిష్యత్ ప్రాజెక్టులకు కేంద్ర సహాయం పొందడం సులభం అవుతుంది. ఇది నగర అభివద్ధికి కీలక నిర్ణయంగా భావిస్తోంది. ఇకపోతే ఈ సమావేశంలో రాష్ట్ర పురోగతికి సంబంధించి పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. వైద్య విధాన పరిషత్‌లో మార్పులు , భూ కేటాయింపులపై కేబినెట్ ముద్ర వేసింది. రాష్ట్రంలోని వైద్య రంగంలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ’తెలంగాణ వైద్య విధాన పరిషత’ పేరును ఇకపై ’డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త’గా మారుస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మార్పుతో పాటు, ఇప్పటివరకు పరిషత్ పరిధిలో ఉన్న ఉద్యోగులను పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులు గా పరిగణించాలని నిర్ణయించారు. దీనివల్ల వేలమంది వైద్య సిబ్బందికి లబ్ది చేకూరనుంది. రాజకీయ పార్టీల బలోపేతానికి సంబంధించి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి భూమిని కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.మరికొన్ని కీలక భూ కేటాయింపులపై కూడా కేబినెట్ స్పష్టతనిచ్చింది. ఖమ్మం జిల్లాలో టీటీడీ ఆలయ నిర్మాణం లేదా ఇతర ఆధ్యాత్మిక సేవల కోసం 20 ఎకరాల భూమిని కేటాయించారు. మహబూబాబాద్ జిల్లా గుమ్మడూరు లో కొత్తగా జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కాలేజీ నిర్మాణానికి గాను 70 ఎకరాల భారీ కేటాయింపుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరిపాలనా సౌలభ్యం కోసం , రాష్ట్ర సర్వతోముఖాభివద్ధి కోసం తీసుకున్న ఈ నిర్ణయాలు తక్షణమే అమలులోకి రానున్నాయి. స్వల్ప అనారోగ్యం కారణంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశానికి హాజరు కాలేదు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశిరచిన జనగణనపై మంత్రిమండలి భేటీలో కీలక చర్చ జరిగింది. ఈ చర్చలో జనగణన వివరాలను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకష్ణారావు వెల్లడించారు. రెండు దశల్లో జనగణన పక్రియ 2027 ఫిబ్రవరిలో రెండో దశ ప్రారంభం కానుంది. జనగణన కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై మంత్రివర్గంలో చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశిరచిన జన గణన పక్రియను చేపట్టేందుకు ప్రభుత్వం కీలక ఆమోదం తెలిపింది. ఈ భారీ కార్యక్రమాన్ని రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వసన్నద్ధమవుతోంది. ఈ సమావేశంలో ముఖ్యంగా నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన తొలి విడత ఇండ్ల గణన అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ రామకష్ణరావు ఈ పక్రియకు సంబంధించిన ఏర్పాట్లను కేబినెట్‌కు వివరిస్తూ, మే 11వ తేదీన ఈ గణనను ప్రారంభించి జూన్ 9వ తేదీ వరకు పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ హౌజ్ లిస్టింగ్ పక్రియ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్దేశిరచిన 34 ప్రశ్నలతో కూడిన నమూనా పత్రాన్ని ప్రభుత్వం వినియోగించనుంది. క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటిని సందర్శించి వివరాలు సేకరించేందుకు సుమారు 84 వేల మంది ఎన్యుమ రేటర్లను, వారికి దిశానిర్దేశర చేసేందుకు నోడల్ ఆఫీసర్లను కలిపి మొత్తం 89 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను ఈ విధుల్లో భాగస్వాములను చేయనున్నారు. తొలి దశ విజయవంతంగా ముగిసిన తర్వాత, అసలైన రెండో దశ జన గణన పక్రియను వచ్చే ఏడాది అంటే 2027 ఫిబ్రవరిలో చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల అంచనాకు ఈ గణన ఎంతో కీలకం కానున్న నేపథ్యంలో, ఎలాంటి లోపాలు లేకుండా ఈ పక్రియను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.రాష్ట్రంలో ఎన్యుమరేటర్లతో పాటు నోడల్ ఆఫీసర్లు మొత్తం 89 వేల మంది ఉద్యోగులు జనగణన పక్రియలో పాలుపంచుకుంటారని తెలిపారు.

60 ఏళ్లలోపు ఉద్యోగి చనిపోతే అదనంగా రూ.10లక్షలు
` ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
హైదరాబాద్(జనంసాక్షి):ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 60 ఏళ్లలోపు ఉద్యోగి చనిపోతే రెగ్యులర్ బెనిఫిట్లతో పాటు అదనంగా రూ.10 లక్షలు వచ్చేలా చర్యలు చేపట్టినట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు అంశాలపై చర్చించింది. మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విÖడియాకు వెల్లడించారు. “ఉద్యోగుల ఆరోగ్య భద్రత, ప్రమాదాల విషయంపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు, పింఛనర్లకు భారం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. రాష్ట్రంలో 7.56 లక్షల మంది ఉద్యోగులు, పింఛనర్లు ఉన్నారు.ఉద్యోగి చనిపోతే రెగ్యులర్ బెనిఫిట్లతో పాటు అదనంగా రూ.10 లక్షలు వచ్చేలా పథకం తీసుకొస్తాం. 17.7 లక్షల మంది ఉద్యోగులు, పింఛనర్లకు డిజిటల్ హెల్త్ ఎంప్లాయ్ కార్డులు అందజేస్తాం. 1998 వ్యాధులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 652 ఆస్పత్రుల్లో చికిత్స అందేలా ఏర్పాట్లు చేస్తాం. రాబోయే 2`3 రోజుల నుంచి ఎంప్యానల్ ఆస్పత్రుల్లో చికిత్సకు ఏర్పాట్లు చేస్తాం. ఉద్యోగుల బేసిక్ పే నుంచి 1.5 శాతం ట్రస్టుకు జమ అయ్యేలా చర్యలు చేపడతాం. ఉద్యోగుల నుంచి రూ.528 కోట్లు సేకరిస్తాం. దీనికి అదనంగా ప్రభుత్వం మరో రూ.528 కోట్లు జత చేసి.. ట్రస్టు ఖాతాలో జమ చేస్తుంది. సీఎస్, సభ్యుల ఆధ్వర్యంలో ట్రస్టు నిర్వహణ ఉంటుంది” అని మంత్రి పొంగులేటి వివరించారు.