రాజమండ్రిలో పాలకల్తీతో ఘటనలో నలుగురు మతి..

` మరో నలుగురి పరిస్థితి విషమం
` పాలవ్యాపారి గణెళిశ్ అరెస్ట్.. పరీక్షలకు పాల నమూనాలు
` పాలకల్తీ మరణాలపై చంద్రబాబు ఆరా
` అధికారులతో సవిÖక్షించి తక్షణ చర్యలకు ఆదేశం
రాజమహేంద్రవరం(జనంసాక్షి): రాజమహేంద్రవరంలో కిడ్నీ సమస్యలతో ఆస్పత్రుల్లో చేరిన వారిలో మరో ఇద్దరు మతిచెందారు. దీంతో మతుల సంఖ్య నాలుగుకు చేరింది. చికిత్స పొందుతూ లాలాచెరువు చౌడేశ్వరినగర్‌కు చెందిన ఎన్.శేషగిరిరావు (72), రాధా కష్ణమూర్తి (74) సోమవారం ఉదయం చనిపోయారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా పాలు కల్తీ కావడంతో మరణించారని తెలుస్తోంది. దీంతో పాలు పోసే వ్యక్తి గాణెళిశ్‌ను అరెస్ట్ చేశారు. పాలను పరీక్షలకు పంపారు. రాజమహేంద్రవరంలోని ఒకే ప్రాంతానికి చెందిన పలువురు కిడ్నీ వ్యాధి బారిన పడి ఆస్పత్రుల్లో చేరడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగిన సంగతి తెలిసిందే. లాలాచెరువు సవిÖపంలోని చౌడేశ్వరినగర్ పరిసర ప్రాంతాల్లో ఈ నెల 15 తర్వాతి నుంచి వాంతులవడం, మూత్రవిసర్జన కాకపోవడం, పొట్ట ఉబ్బడం తదితర సమస్యలతో ఒక్కొక్కరుగా 14 మంది ఆసుపత్రిలో చేరారు. వీరిలో భాగిశెట్టి కనకరత్నం (76), తాడి కష్ణవేణి (75) ఇప్పటికే మతిచెందారు. బాధితుల్లో ఎక్కువ మంది 60 ఏళ్లు పైబడినవారే కాగా 5 నెలల శిశువు, మూడేళ్ల బాలుడు కూడా ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనారోగ్యానికి గురవడంతో వారు ఆదివారం అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రుల పాలైన బాధితులందరికీ ఒకే వ్యక్తి పాలు పోస్తుండటంతో అక్కడే కల్తీ జరిగి ఉండొచ్చని వైద్యాధికారులు, బాధితులు పోలీసులకు తెలిపారు. శివరాత్రి రోజు పాలు, పెరుగు చేదుగా అనిపించాయని కొంతమంది బాధితులు చెప్పారు. కోరుకొండ మండలానికి చెందిన గణెళిష్ అనే వ్యాపారి వీరందరికీ పాలు పోస్తున్నట్లు గుర్తించడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. బాధితుల నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాలను టాక్సికాలజీ పరీక్షకు పంపించారు. ఆ నమూనాల నివేదికలు రావాల్సి ఉంది.
పాలకల్తీ మరణాలపై చంద్రబాబు ఆరా
రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్‌లో స్థానికుల అస్వస్థత, మరణాలపై సీఎం చంద్రబాబు ఆరా తీసారు. పాలకల్తీ వ్యవహారంపై అధికారులతో సవిÖక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్యారోగ్యశాఖ, ఫుడ్ సేప్టీ అధికారులతో వర్చువల్‌గా ఆయన సమావేశమయ్యారు. ప్రస్తుతం బాధితులకు అందుతున్న సాయాన్ని సీఎంకు వారు వివరించారు. మెరుగైన వైద్యం అందించాలని చంద్రబాబు ఆదేశించారు. అధికారులు వెంటనే అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలన్నారు. బాదఙతులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని అన్నారు. రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో విక్రయదారులు 106 ఇళ్లకు పాలు పంపిణీ చేశారని అధికారులు వివరించారు. పాలు వినియోగించిన కుటుంబాల్లోని 73 మంది నుంచి రక్తనమూనాలను సేకరించామని.. మిగిలిన వారివి కూడా సేకరిస్తున్నామని చెప్పారు. ఫుడ్ సేప్టీ అధికారులు పాల నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపారని తెలిపారు. క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలతో పాటు ర్యాపిడ్ టెస్ట్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని సీఎంకు అధికారులు వివరించారు. పాల నమూనాలపై ఫలితాల అనంతరం విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. ఫుడ్ సేప్టీ, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు తక్షణమే రాజమహేంద్రవరం వెళ్లాలన్నారు.
వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది
కల్తీ పాల ఘటనలో ఆస్పత్రుల్లో 12 మంది ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు. ఈ ఘటనలో నిందితుడిగా ఉన్న పాల వ్యాపారి 126 కుటుంబాలకు పాలు పోసినట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ కిడ్నీ బాధిత ప్రాంతాల్లో కలెక్టర్, ఎస్పీతో కలిసి వీరపాండ్యన్ క్షేత్రస్థాయిలో పర్యటించి
వివరాలు తెలుసుకున్నారు. అనుమానిత లక్షణాలు ఉన్నవారు కూడా వైద్యులను సంప్రదించాలని సూచించారు. బాధితుల వైద్య ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. రాజమహేంద్రవరంలో కిడ్నీ సమస్యలతో ఆస్పత్రుల్లో చేరిన వారిలో ఇప్పటి వరకు నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. రాజమహేంద్రవరంలోని ఒకే ప్రాంతానికి చెందిన పలువురు కిడ్నీ వ్యాధి బారిన పడి ఆస్పత్రుల్లో చేరడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగిన సంగతి తెలిసిందే. లాలాచెరువు సవిÖపంలోని చౌడేశ్వరినగర్ పరిసర ప్రాంతాల్లో ఈ నెల 15 తర్వాతి నుంచి వాంతులవడం, మూత్రవిసర్జన కాకపోవడం, పొట్ట ఉబ్బడం తదితర సమస్యలతో పలువురు వివిధ ఆస్పత్రుల్లో చేరారు.