భావోద్వేగాల మధ్య ప్రణబ్‌కు వీడ్కోలు

భావోద్వేగాల మధ్య  ప్రణబ్‌కు వీడ్కోలుటెన్‌ జన్‌పథ్‌లో సమావేశం
ప్రణబే అత్యున్నత పదవికి అర్హుడు : సోనియా

న్యూఢిల్లీ,  :
రాష్ట్రపతి అభ్యర్థిగా యుపిఎ తరఫున బరిలోకి దిగుతున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఆర్థిక మంత్రిప్రణబ్‌ముఖ్జరికి  పార్టీ సోమవారం నాడు సగౌరవంగా వీడ్కోలు పలికింది. టెన్‌ జనపథ్‌లోని యూపిఎ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో సోమవారం సిడబ్ల్యూసి సమావేశం జరిగింది. ఈ సమావేశం ఆద్యంతం ఉద్విగ్నభరితంగా కొనసాగింది. ఎన్నో భావోద్వేగ క్షణాలు చోటు చేసుకున్నాయి. పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన సిడబ్ల్యుసి ప్రణబ్‌ముఖర్జీని అభినందించింది.  ప్రణబ్‌తో తమకున్న సుదీర్ఘ సాన్నిహిత్యాన్ని మననం చేసుకుంటూ ఆయన ప్రతిభను కొనియాడుతూ సభ్యులు అభినందించారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రక్షణ మంత్రి ఎకె ఆంటోని తదితరులు మాట్లాడుతూ పార్టీకి ప్రణబ్‌ అందించిన సేవలను ప్రశంసించారు. ప్రధాని మన్మోహన్‌ మాట్లాడుతూ రాజకీయ కురువృద్ధుడు అయిన ప్రణబ్‌ముఖర్జీ సేవలను తామంతా కోల్పోతున్నా మని అన్నారు. సోనియాగాంధీ మాట్లాడుతూ జులై 19న జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో భారీ మెజారిటీతో ప్రణబ్‌ గెలవగలరన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సిడబ్ల్యుసితో తనకున్న సుదీర్ఘ బంధాన్ని గుర్తు చేసుకుంటూ ఇన్నాళ్లు తనకు సహకరించిన పార్టీ సహచరులకు