భూ సేకరణ బిల్లుతో రైతులకు మేలు : కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు

4vbkhnlqహైదరాబాద్‌, మార్చి 23 : దేశంలో భూసేకరణ బిల్లుతో రైతులకు మేలు జరుగుతుందని కేంద్రమంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్‌లో విలేకరులతో మంత్రి వెంకయ్య మాట్లాడుతూ భూసేకరణ బిల్లుకు తొమ్మిది సవరణలు చేశామని, దీనిపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. భూసేకరణ చట్టాన్ని రాష్ట్రాలు అమలు చేయవచ్చు… లేదంటే పాత చట్టాన్నే కొనసాగించుకోవచ్చని మంత్రి అన్నారు. పార్లమెంట్‌ సమావేశాల తీరు ఫలప్రదంగా జరిగిందని, గత పదేళ్లలో అత్యుత్తమంగా సభ సాగిందన్నారు. గనుల బిల్లు వల్ల కొన్ని రాష్ట్రాలకు ప్రయోజనం ఉందన్నారు.