*మద్దూర్ లో వివిధ గ్రామాల్లో మెగా ప్లాంటేషన్ ప్రోగ్రాం నిర్వహించిన అధికారులు*
మద్దూర్ (జనంసాక్షి):- నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని వివిధ గ్రామాల్లో స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా నేడు మెగా ప్లాంటేషన్ ప్రోగ్రాం వివిధ గ్రామపంచాయతీలందు నిర్వహించారు. అనంతరం పలు గ్రామాల్లో ధికారులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయలక్ష్మి , సర్పంచులు, ఎంపీటీసీలు ఏపీవో ,ఫారెస్ట్ ఆఫీసర్ ,రెవిన్యూ ఇన్స్పెక్టర్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.