మరోక్కసారి రైతు పక్షపాతి అని నిరూపించుకున్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి.

కోడేరు (జనంసాక్షి) సెప్టెంబర్ 23 కోడేరు మండలంలోని నార్యా నాయక్ తండాలో గత రెండు రోజుల క్రితం కె.ఎల్.ఐ కాలువకు మూడు చోట్ల గండి పడడం వల్ల నీళ్లు వృధాగా పోవడంతో స్థానిక టిఆర్ఎస్ నాయకులు భాస్కర్ నాయక్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకు పోగా వారు వెంటనే స్పందించి ఈ రోజు టీఆర్ఎస్ నాయకులు భాస్కర్ ని స్వయంగా దగ్గర ఉండి కాలువ మరమ్మతు పనులు చేయించాలని ఆదేశించారు.

ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఈ రోజు కాలువ మరమ్మతు పనులు పూర్తి చేయడం జరిగింది. _అదేవిధంగా గత వారం రోజుల క్రితం నాగులపల్లి తాండ నుంచి తెల్లరాళ్ల పల్లి తాండ వరకు సుమారు 12 కిలోమీటర్ల మేర కాలువలో జమ్ము ఉండడం వల్ల నీళ్లు పోవడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగ వారు వెంటనే హిటాచిని పంపించి జమ్ము తొలగించి కాలువలో నీటి పారుదల కు ఆటంకం లేకుండా చేయడం జరిగింది.
సాగునీటికి ఇబ్బందులు తొలగిపోవడంతో పలు గ్రామాల రైతులు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.