మరో ఉద్యమానికి టీఆర్‌ఎస్‌ సమర శంఖం

కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం శత విధాల ప్రయత్నించిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మరో ఉద్యమానికి సమర శంఖం పూరించారు. పార్టీ కేడర్‌లో ఆత్మస్థైర్యంనింపి ఉద్యమ దిశగా నడిపించేందుకు కరీంనగర్‌లో మేధోమథన సదస్సు ప్రారంభించారు. 10 జిల్లానుంచి వందలాదిగా పార్టీ నేతలు, కార్యకర్తలు, మేథావులు తరలివచ్చారు. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. రేపు సాయంత్రం ఉద్యమ ప్రణాళికను కేసీఆర్‌ ప్రకటిస్తారు.