ముంబయి నగర పోలీస్‌ కమిషనర్‌ బదిలీ

ముంబయి: ఈ నెల 11న ఆజాద్‌ మైదానంలో చోటుచేసుకున్న హింసను ఆణచివేయడంలో వైఫల్యంపై ప్రతిపక్షలు తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం వల్లే నగర పోలీస్‌ కమిషనర్‌ ఆరువ్‌ పట్నాయక్‌ను గురువారం బదిలీ చేసినట్లు సమాచారం. పరిపాలనా ప్రక్రియలో భాగంగానే బదిలీ చేశామని వెల్లడించింది. ఆయన స్థానంలో ఆదనపు డైరెక్టర్‌ జనరల్‌ (శాంతిభద్రతలు) సత్యపాల్‌సింగ్‌ను నియమించారు. పట్నాయక్‌కు డీజీపీగా స్థాయి పెంచి మహారాష్ట్ర రాష్ట్ర భద్రతా సంస్థ ఎండీగా నియమించామని హోం మంత్రి ఆర్‌.ఆర్‌.పాటిల్‌ గురువారం ఓ వార్తా సంస్థతో మట్లాడుతూ వెల్లడించారు. ఈ నేపథ్యంలో బదిలీ చోటుచేసుకుందని వస్తున్న వదంతులను హోం మంత్రి తోసిపుచ్చారు. జులై ఆరో తేదీన పట్నాయక్‌ బదిలీకి సంబంధించిన దస్త్రం డీజీపీ ఆఫీసులో రూపొందిందన్నారు.