*మునిపంపుల పి హెచ్ సి లో బతుకమ్మ సంబరాలు*
ముఖ్యఅతిథిగా
ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం*
రామన్నపేట సెప్టెంబర్ 30 (జనంసాక్షి)
మునిపంపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు పంపిణీ చేసిన చీరలను ఎంపీపీ చేతుల మీదుగా అందించారు.అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సద్దుల బతుకమ్మను ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మునిపంపుల గ్రామ సర్పంచ్ యాదాసు కవితయాదయ్య, డాక్టర్ శ్రీశైలం, ఎంపీటీసీ గాదే పారిజాత ఆరోగ్య సిబ్బంది హెచ్ ఈ గోపాల్, రమణమ్మ, విజయలక్ష్మి, వాణి, పరమేశ్వరి, అరుంధతి, మల్లేష్ ,సుధాకర్, సైదులు ఏఎన్ఎంలు కేతమ్మ , శ్యామల, మంజుల, గీత ,రజిత, ఆదిలక్ష్మి, ఆశా వర్కర్స్, తదితరులు పాల్గొన్నారు.