ముస్లిం సోదరులకు వైఎస్‌ఆర్ రంజాన్ శుభాకాంక్షలు
మంథని టౌన్ జాలై 21 జనంసాక్షి): పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేసే ముస్లీం సోదరులకు వైయస్‌ఆర్‌సీపీ నాయకులు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. వైయస్‌ఆర్‌సీపీ మండల కన్వీనర్ ఎగోళపు శంకర్‌గౌడ్ మాట్లాడుతు పండగలు మత సామరస్యానికి ప్రతీకలు అన్నారు. ముస్లీం సోదరులు నెల రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తారు. వారి మతచారన్ని గౌరవిస్తామని అన్నారు. ముస్లీం సోదరులకు తమ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్‌ఆర్ సీపీ నాయకుల పాల్గోని ముస్లీం సోదరులందరికి శుభాకాంక్షలు తెలిజేశారు.