మృతుల కుటుంబాలను పరామర్శించిన తెలంగాణ తొలి శాసనసభాపతి ఎమ్మెల్సీ సిరికొండ
రేగొండ : మండలంలోని దుంపిల్లపల్లి గ్రామానికి చెందిన బత్తిని కొమురయ్య,తిరుమలాగిరి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పనికేల రాజేందర్ తల్లి లక్ష్మి వివిధ కారణాలతో మరణించగా వారి కుటుంబ సభ్యులను ఆదివారం ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పరామర్శించి,ఆర్థిక సహాయం అందజేశారు. వారి వెంట తెరాస మండల నాయకులు లెంకల రాజిరెడ్డి,మాజీ ఎంపీపీ ఈర్ల సదానందం,గోపు భిక్షపతి,మాడికంటి మహేందర్, ప్రచార కార్యదర్శి వావిలల రమేష్, యువజన విభాగం రాష్ట్ర నాయకులు గుర్రాల సుమన్ రెడ్డి, బూర్గుల ప్రభాకర్,కునాటి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.