మెగా రక్తదాన శిబిరం

ఖమ్మ గ్రామీణం: ఖమ్మం పార్లమెంటు సభ్యుడు. తెదేపా పార్లమెంటు పక్ష నాయకుడు నామా నాగేశ్వరరావు జన్మదినం సందర్భంగా శుక్రవారం మడంలంలోని నాయుడు పేట గ్రామంలోని పీవీఆర్‌ గర్డెన్‌లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో వివిధ ఇంజినీరింగ్‌ కళాశాలల విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేస్తున్నారు. పాలేరు నియోజకవర్గ తెదేపా నాయకురాలు స్వర్ణకుమారి, జిల్లా అధ్యాక్షుడు కొండబాల కోటేశ్వరరావు తదితరుల పర్యవేక్షణలో రక్తదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.