మెస్‌ ఛార్జీలు పెంచాలని విద్యార్థుల ధర్నా

కరీంనగర్‌, అక్టోబర్‌ 29 : విద్యార్థుల మెస్‌ ఛార్జీలను పెంచాలని, గ్యాస్‌ సిలిండర్లపై విధించిన నిబంధనను తొలగించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ, విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తునందుకే నిదర్శనమే ఇందుకు కారణమని వారు అన్నారు. అంతేకాక విద్యుర్థుల  స్కాలర్‌ షిప్పులు, మెస్‌ ఛార్జీల ధరలు తగ్గించడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇలాంటి చర్యలను మానుకోవాలని కోరారు. వెంటనే సిలిండర్లపై విధించిన నిబంధనను తొలగించాలని, మెస్‌ ఛార్జీలను పెంచాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో  విద్యార్థి సంఘాల నేతలు అర్జున్‌, రమేష్‌, నాగరాజు, రాజేందర్‌ పాల్గొన్నారు. అనంతరం వీరు కలెక్టర్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు.