మేడ్చల్ జాతీయ రహదారిపై ఆర్టీఏ తనిఖీలు
రంగారెడ్డి: మేడ్చల్ జాతీయ రహదారిపై రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న 3 పర్యాటక బస్సులు, ఓవర్లోడ్తో వెళ్తున్న 7లారీలను పట్టుకున్నారు. వాహనాల యజమానులపై కేసులు నమోదు చేసినట్లు తెలియజేశారు.