మేయర్ సుధారాణిని కలిసిన దసరా ఉత్సవ కమిటీ
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 23(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని ఉరుసు కరిమాబాద్ దసరా ఉత్సవ కమిటీ బాధ్యులు శుక్రవారం వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి తో పాటు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ను విడివిడిగా కలిశారు. ఈ సందర్భంగా గత ఏడాది దసరా ఉత్సవాలకు సంబంధించిన ఆల్బమ్ అందించారు. ఈసారి దసరా ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించేలా తోడ్పాటు అందించాలని మేయర్ తో పాటు ఎమ్మెల్సీని కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు నాగపూరీ సంజయ్ బాబు, ప్రధాన కార్యదర్శి మేడిది మధుసూదన్, ఉత్సవ కన్వీనర్ వడ్నాల నరేందర్, ట్రస్ట్ చైర్మన్ వంగరి కోటేశ్వర్, ఓగిలిశెట్టి అనిల్, గోనె రాంప్రసాద్, సుంకర సంజీవ్, అశోక్, సందీప్, మధు, రంజిత్, మహేష్, రాజు, శ్రీనివాస్, కృష్ణ, గోవర్ధన్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area