మైనార్టీ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ పోస్టులు భర్తీచేయాలి

 

నాంపల్లి : మైనార్టీ కమీషన్‌, మైనార్టీ పైనాన్స్‌ కార్పోరేషన్‌లకు ఛైర్మెన్లను నియామించాలని అల్‌ ఇండియా సున్ని ఉలెమాబోర్డు వర్కింగ్‌ కమిటీ ప్రతినిదులు సయ్యద్‌ షా అమిద్‌ హుస్సేన్‌,చటారీ, కోఅర్డినేటర్‌ అహ్మద్‌ సిద్దిఖీ ముఖేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం హైదర్‌గూడలోని న్యూస్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ… ఏపీ స్టేట్‌ మెనారిటీ పైనాస్స్‌ కార్పోరేషన్‌లో నిదుల దుర్వినిమోగానికి పాల్పడినవారిని చట్ట పరంగా శిక్షించాలని డిమాండ్‌చేశారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌, డీజీపీలకు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.