రక్తం పారిన నేల…నిధులు ఇవ్వకుంటే ఎలా…?

మేడిపల్లి: ఆ పల్లెలు నక్సల్స్‌ దాడులో ఉక్కిరి బిక్కిరయ్యేవి. పోలీసుల పదఘట్టనలతో భయం నీడన గడడిపేవి. అటు నక్సల్స్‌ ఇటు పోలీసుల నడుమ ప్రశాంత జీవనం ఎలా ఉంటుందో తెలియని స్థితి ఉండేది. రహదారుల సంగతి దేవుడెరుగు..కాలినడకా కష్టమయ్యేది. పరిస్థితులు మారాయి. నక్సలైట్ల ప్రభావిత గ్రామాలకు నిధులు మంజూరయ్యాయి. రోడ్లు మారితే పల్లెలు ప్రగతి పధంలో పయనిస్తాయని సర్కారు భావించింది. ఇందుకోసం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోంది. కానీ నక్సలైట్ల నీడన గడిపిన ప్రాంతాలకు ఆ నిధులు సమప్రాధాన్యంలో రావడం లేదు. అందుకు మేడిపల్లి మండలంలోని నక్సల్స్‌ ప్రభావిత గ్రామాలే సాక్ష్యం.