రక్షణ వలయంలో లండన్‌ సిటీ

-ఒలింపిక్స్‌ కోసం భారీ భద్రత
లండన్‌: లక్ష్యాన్ని చేదించే అత్యాధునిక మిస్సైల్స్‌ రెడీగా ఉన్నాయి. అవసరమైతే వినియోగించేందుకు యుద్ధ విమానాలు సిద్ధం.. ముందు జాగ్రత్తగా సబ్‌మెరైన్లు మోహరించి ఉన్నాయి. ఎవరు ఎటువైపు నుంచి దాడి చేసినా ఎదుర్కొనేందుకు మిలిటరీ బలగాలు కూడా తయారుగా ఉన్నాయి.. ఇవేవో యుద్ధానికి సిద్ధమైన దేశం చేసుకున్న ఏర్పాట్లు కావు ఒలింపిక్స్‌ కోసం ఇంగ్లాండ్‌ చేసిన పూర్తి స్థాయి భద్రతా వ్యూహం. లండన్‌ ఒలింపిక్స్‌కు ఉగ్రవాదుల ముప్పు ఉండడంతో ఆ దేశ ప్రభుత్వం కనివినీ ఎరుగని రీతిలో సెక్యూరిటీ అరెంజ్‌మెంట్స్‌ చేసింది. లండన్‌ టైట్‌ సెక్యూరిటీపై స్పెషల్‌ స్టోరీ…
లండన్‌ ఒలింపిక్స్‌ను ఉగ్రవాదులు టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఆల్‌ఖైదా సహా పలు తీవ్రవాద సంస్థలు విశ్వక్రీడల్లో పెను విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని ఇప్పటికే నిఘా వర్గాలు హెచ్చరించాయి ఈ హెచ్చరికలను నిజం చేస్తూ ఇటీవలే ఆరుగురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. ఒలింపిక్‌ ప్రధాన వేదికకు కేవలం కిలో మీటర్‌ దూరంలోనే వీరు పట్టుబడడం కలకలం రేపింది. ముందస్తూ సమాచారం ప్రకారం దాడి చేసిన యాంటీ టెర్రర్‌ స్క్వాడ్‌ వారి నుంచి పలు మారుణాయుధాలను స్వాధీనం చేసుకుంది. నిఘావర్గాల అప్రమత్తతతో లండన్‌లో ఇప్పటికే రెండుసార్లు రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. ప్రధాన కూడళ్లలో భద్రతను పెంచారు. అథ్లెట్ల సెక్యూరిటీకి పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ప్రధాన కూడళ్లలో హోటల్స్‌ దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ముందస్తూ చర్యగా బర్మింగ్‌ హామ్‌ .దానిరి మూసివేశారు. ఆటగాళ్లందరూ దిగే ప్రధాన ఎయిర్‌పోర్ట్‌ దగ్గర నుంచి గేమ్స్‌ విలేజ్‌ వరకూ అడుగడుగునా రక్షణ చర్యలు చేపట్టారు. పటిష్టమైన నిఘావ్యవస్థతో అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నారు. తీవ్రవాదులు దాడులు చేస్తే వారిని ప్రతిఘటించేందుకు అత్యాధునిక ఎయిర్‌మిస్త్సెల్స్‌ రంగంలోకి దించారు, టెర్రరిస్టులు ఏ తరహా దాడులకు దిగినా ఎదుర్కొనేందుకు బ్రిటన్‌ బలగాలు సిద్ధంగా ఉన్నాయి. ఇందుకు త్రివిధ దళాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఒలింపిక్స్‌ సెక్యూరిటీ కోసం 17వేల మంది బ్రిటీష్‌ సైన్యం సిద్ధమవుతున్నారంటే భద్రతా ఏర్పాట్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు పెద్ద ఎత్తున ప్రైవేట్‌ సైన్యం సేవలనూ ఇంగ్లాండ్‌ సర్కారు వినియోగించుకుంటోంది. ముందస్తూ చర్యగా ఒలింపిక్స్‌ స్టేడియం , ధేమ్స్‌ నది ఒడ్డున మిలిటరీ, ఎయిర్‌ఫోర్స్‌, ట్రైల్‌ రన్‌ నిర్వహించాయి. ఎయిర్‌పోర్టులోనూ నిఘా పెంచారు. విదేశాల నుంచి వేల సంఖ్యలో పోటీలు తిలకించేందుకు సందర్శకులు వచ్చే అవకాశం ఉండడంతో భారీగా రక్షణ చర్యలు చేపట్టారు. ఒలింపిక్స్‌కు ఎటువంటి విఘాతం కలుగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలూ చేపట్టినట్లు ఇంగ్లాండ్‌ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌ చెబుతోంది. అయితే ఈ సెక్యూరిటీ ఏర్పాట్ల కారణంగా లండన్‌ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలో పలు అపార్ట్‌మెంట్‌ పైన పరిసరాల్లో మిస్సైల్స్‌, సెక్యూరిటీ ఫోర్స్‌తో వారికి చికాకకు కలుగుతోంది. దీనిపై కొందరు కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే దేశ ప్రతిష్ట, అందరి భద్రతే ముఖ్యమని, లండన్‌ వాసులు కొన్ని రోజులు సహనంతో ఉండాలని కోర్టు సూచించింది. మొత్తం మీద ఒలింపిక్స్‌ను ఎటువంటి అడ్డంకి లేకుండా నిర్వహించేందుకు లండన్‌ పూర్తి స్థాయిలో సిద్ధమైందని తెలుస్తోంది.