రాజేష్ నగర్ కాలనీలో గణేష్ మంటపం కూల్చివేత

ఆగ్రహించిన మహిళలు, కాలనీవాసులు
యధావిధిగా నిర్మించకపోతే ఆందోళన : బిజెపి
మేడిపల్లి – జనంసాక్షి
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్ల
రాజేష్ నగర్ కాలనీలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గణేష్ మండపాన్ని కూల్చివేశారు. మండపంలో గణేషుని విగ్రహం ఉన్నా పట్టించుకోకుండా చర్యలకు దిగారు. ప్రతిష్టాత్మకంగా జరుపుకునే గణేషుని నవరాత్రి ఉత్సవాలకు మున్సిపల్ అధికారులు అడ్డుతగలడంతో మహిళలు, కాలనీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధి అండతోనే గణేషుని మండపాన్ని కూల్చారనీ స్థానికులు ఆందోళన చేపట్టారు. హిందూ సంప్రదాయ పండుగలంటే టిఆర్ఏస్ ప్రభుత్వానికి గిట్టధా అంటూ మహిళలు, స్థానికులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా బోడుప్పల్ బిజెపి పార్టీ ప్రధాన కార్యదర్శి ఏర్పుల మహేష్ కుమార్ మాట్లాడుతూ.. కూల్చివేతపై కమిషనర్, మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ లక్ష్మి రవిగౌడ్, స్థానిక కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్ స్పందించాలని, గణేషుని మండపాన్ని యదావిధిగా నిర్మించాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.