రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా రంజాన్‌ వేడుకలు

హైదరాబాద్‌: రంజాన్‌ పండగను ముస్లింలు రాష్ట్రవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. అన్ని జిల్లాల్లో ముస్లింలు ఉదయం నుంచి రంజాన్‌ ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. హైదరాబాద్‌ పాతబస్తీలోని మక్కామసీదు, మీరాలం ఈద్గాల్లో ప్రార్థనలు కోసం పెద్ద సంఖ్యలో ముస్లింలు చేరుకున్నారు. రంజాన్‌ వేడుకలకు కడప పెద్దదర్గ సిద్ధమైంది.