రాష్ట్రవ్యాప్తంగా ధరణి పోర్టల్ పై కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరో ఉద్యమం

share on facebook
ధరణి పోర్టల్ పూర్తిగా రద్దు చేయాలి
 ధరణి తో తీరని రైతుల సమస్యల
 రేపే మండల రెవెన్యూ కార్యాలయాల ముందు ధర్నా
అయిజ, నవంబర్ 23 (జనం సాక్షి) :
టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ రైతుల పట్ల శాపంగా మారిందని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ,మాజీ శాసనసభ్యులు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఆదేశానుసారం  అయిజ పాత బస్టాండ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాష్ట్ర ఓబిసి కార్యదర్శి మాస్టర్ షేక్షావలి ఆచారి టిఆర్ఎస్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు.భూ సమస్యలు సరిదిద్దడానికి ధరణి పేరుతో ఎకరాకు 2500 రూపాయలు  కట్టించుకుని రెవెన్యూ అధికారులు రిజెక్ట్ కొట్టేస్తూ నెలకు జిల్లాలో యాభై నుంచి అరవై లక్షల రూపాయలను ప్రభుత్వం ..రైతుల నుండి దండు కుంటుంది.రైతులను చెప్పులరిగేలా ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ  రెవెన్యూ అధికారులు తిప్పుతున్నారని,భూ సమస్యలు పరిష్కరిస్తామని ఏర్పాటుచేసిన ధరణి పేరుతో సమస్యలను పెంచి రైతుల పక్షాన శాపంగా  మార్చారని షేక్షావలి ఆవేదన వ్యక్తం చేశారు.ఈనెల 24వ తారీకు అనగా రేపు రాష్ట్రంలో ఆన్ని రెవిన్యూ ఎమ్మార్వో కార్యాలయాల ముందు రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమం చేపట్టనుంది . 2017 లో ప్రారంభించిన ధరణి పోర్టల్ అంతవరకు  రైతుల సమస్యలు పరిష్కరించక పోవడంతో ఈ నెల 24 న రాష్ట్ర అన్ని ఎమ్మార్వో కార్యాలయం ముందు ,30వ తారీఖున నియోజకవర్గ కేంద్రంలోను, డిసెంబర్ 5న కలెక్టరేట్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాలను చేపట్టాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు సమస్యలు ఉన్న ప్రతి రైతు ఈ ధర్నా కార్యక్రమాల్లో పాల్గొనాలని షేక్షావలాచారి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఉత్తనూర్ జయన్న  నాయకులు మద్దిలేటి, , మాస్టర్ అడ్వకేట్ మధు ,బసవరాజు బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు సాంబశివుడు,  ,పాండురంగ రాజు,రవీందర్, శాలి పైల్వాన్ రఘు, బాబు,రవి,హన్మథు,తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Other News

Comments are closed.