రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలో లేదు: మంత్రి శ్రీధర్‌బాబు
హుస్నాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలో లేదని, ప్రభుత్వానికి అవసరమైనా సంఖ్యా బలం ఉందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లను ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో 2009 ఏర్పాటైన తమ ప్రభుత్వం 2014 వరకు కొనసాగుతుందని, తర్వాతే ప్రజాక్షేత్రంలోకి వెళ్తుతుందన్నారు. ముఖ్యమంత్రిని మార్చాలనే ఆలోచన పార్టీ అధిష్ఠానానికి లేదన్నారు. తెలంగాణ వాదులపై ఆనుచరులతో దాడులు చేయిస్తున్నారనే ఆరోపణలపై స్పందిస్తూ ఆ అవసరం తనకు లేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా సాధించాలో తమకు తెలుసన్నారు. ధాన్యం, పత్తి కొనుగోళ్లలో రైతులకుఎక్కడా ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోదన్నారు.