రాష్ట్ర స్థాయిలో సైబరాబాద్‌కు గుర్తింపు తేవాలి

హైదరాబాద్‌: క్రీడాస్ఫూర్తితో సిబ్బంది విజయాలను సాధించి రాష్ట్రస్థాయిలో సైబరాబాద్‌కు గుర్తింపు తేవాలని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో సైబరాబాద్‌ పోలీస్‌ గ్రౌండ్స్‌లో 5వ పోలీస్‌మీట్‌ను ఆయన ప్రారంభించారు. మూడురోజులపాటు జరిగే ఈ పోటీల్లో మాదాపూర్‌, శంషాబాద్‌, మల్కాజిగిరి, అల్వాల్‌, బాలానగర్‌ జోన్ల పరిధిలోని పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.