రాహుల్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధం : సీఎం
జైపూర్ : రాహుల్‌గాంధీ నేతృత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో కాంగ్రెస్ మేధోమథనం చింతన్ శివర్‌లో ఆయన ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టే ప్రతి ఆలోచన ఆంధ్రప్రదేశ్ నుంచే మొదలు పెడుతోందన్నారు. పార్టీలోనూ, చట్టసభల్లోనూ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన కోరారు.