రిటైర్మెంట్‌ ప్రకటించే సమయం సచిన్‌కు బాగా తెలుసు : లారా

అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలిగే సమయం మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ బాగా తెలుసని వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం బ్రియన్‌ లారా అన్నారు. ఇటీవల భారత్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో సచిన్‌ ఘోరంగా విఫలమైన విషయం తెల్సిందే. ఈ సిరీస్‌ తర్వాత సచిన్‌ ఫామ్‌ తో పాటు.. రిటైర్మెంట్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చెల రేగాయి. అనేక మంది క్రికె టర్లు సచిన్‌ టెస్టులకు గుడ్‌బై చెప్పాలని కోరగా, దానికి ఇంకా సమయం ఆసన్నం కాలే దంటూ మరికొందరు అభిప్రా యపడ్డారు. దీనిపై బ్రియాన్‌ లారా స్పందిస్తూ అంతర్జాతీయ టెస్ట్‌ క్రికెట్‌ నుంచి ఎపుడు వైదొలగాలో సచిన్‌కు బాగా తెలుసని తాను నమ్ముతున్నట్టు చెప్పుకొచ్చాడు. భారత క్రికెట్‌కు మాత్రమే కాకుండా క్రికెట్‌ ప్రపంచానికి సచిన్‌ ఓ ఆస్థి అని లారా కొనియాడాడు. ఓ చిన్న పిల్లాడిలా సచిన్‌ను తీసివేయోద్దు. అతనో గొప్ప బ్యాట్స్‌మెన్‌. గతంలో అతను ఆడిన ఆటను చూసి ఆశ్వాదించండి, ఆనందించండి. అంటూ లారా హితపు పలికాడు. కాగా, కొలంబోలో జరిగిన ఐసీసీ వార్షిక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో బ్రియాన్‌ లారా పాల్గొన్నాడు. ఇందులో హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో లారాను 17వ వెస్టిండీస్‌ క్రికెటర్‌గా అవతరించాడు.