స్విట్జర్లాండ్ న్యూఇయర్ వేడుకల్లో అపశృతి
` బాణాసంచా పేలి 40 మంది మ ృతి
బెర్న్(జనంసాక్షి): స్విట్జర్లాండ్ న్యూఇయర్ వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది. బాణాసంచా పేలి 40మంది మ ృతి చెందారు. మ ృతుల సంఖ్య అధికారికంగా ప్రకటించాల్సి ఉండగా..స్థానిక మీడియా కథనాల ప్రకారం.. 40 మంది మరణించారని, 100మంది గాయపడినట్లు తెలుస్తోంది.సియెర్రె క్రాన్స్ మోంటానాలోని స్కై రిసార్ట్‌లోని ఓ బార్‌లో బుధవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటు చేసుకుంది. న్యూఇయర్ వేడుకల కోసం భారీ సంఖ్యలో గుమిగూడిన సమయంలోనే ఘటన జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. పోలీసులు వెల్లడిరచిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి 1.30గం. సమయంలో లె కాన్‌స్టెలేషన్ బార్‌లో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.పేలుడు సమయంలో బార్‌లో వంద మంది ఉన్నారని అధికారులు అంటున్నారు. అయితే.. అంతకు మించే జనం గుమిగూడారని స్విస్ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. బార్‌లోని బేస్‌మెంట్‌లోనే 400 మంది ఉన్నారని నివేదికలు ఇస్తున్నాయి. దీంతో మ ృతులు, క్షతగాత్రుల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది.అయితే బార్‌లో కాల్పులు, పేలుడు సంభవించినట్లు తొలుత కథనాలు వెలువడ్డాయి. కానీ ఈ ప్రమాదం కాల్పుల వల్ల జరగలేదని, బాణా సంచాపేలి ప్రమాదం జరిగినట్లు స్థానిక పోలీసులు మీడియా సమావేశంలో అనుమానం వ్యక్తం చేశారు. దురెటనపై కేసు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్లు వెల్లడిరచారు. స్విస్ వార్తా సంస్థ బ్లిక్ ప్రకారం..కచేరీ సమయంలో కాల్చిన బాణసంచా పేలి మంటలు చెలరేగడం వల్లే ప్రమాదం సంభవించి ఉండవచ్చని కథనాల్లో పేర్కొంది.సియెర్రెలోని క్రాస్ మోంటానా పర్యాటకానికి ప్రసిద్ధి. మరీ ముఖ్యమంగా బ్రిటీష్ జాతీయులు ఇక్కడికి పోటెత్తుంటారు. రాజధాని బెర్న్ నుంచి రెండు గంటలకే ఇక్కడికి ప్రయాణం. అందునా లగ్జరీ బార్‌గా పేరున్న లె కాన్‌స్టెలేషన్‌కి రద్దీ ఎక్కువగా ఉంటుంది. 2012లో ఈ రీజియన్‌లోనే బస్సు ప్రమాదం ఆ దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన విషాదం. తాజా దాడిలో మ ృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని పరిస్థితిని బట్టి తెలుస్తోంది. సోషల్ మీడియాతో తాజా ప్రమాదానికి సంబంధించిన ద ృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

