జీరో అవర్‌తో సభను ప్రారంభించడం చరిత్రలో ఎప్పుడూ చూడలే

జనవరి 02 (జన సాక్షి) నేరుగా జీరో అవర్‌తో శాసససభ సమావేశాలను ప్రారంభించడం భారతదేశ చరిత్రలో తాను ఎన్నడూ చూడలేదని అసెంబ్లీలో బీఆర్‌ఎస్ పార్టీ విప్ కేపీ వివేకానంద అన్నారు. క్వశ్చన్ అవర్ లేకుండా, ఓ ఎజెండా లేకుండా, సబ్జెక్టు లేకుండా నేరుగా జీరో అవర్‌తో సభను ప్రారంభించడం ఈ మూర్ఖపు రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలనే చూస్తున్నమని ఆయన వ్యాఖ్యానించారు.
అసెంబ్లీలో రేపటి ఎజెండా ఏమిటనేది ముందు రోజే సభ్యులకు తెలియజేస్తే సంబంధిత టాపిక్స్‌పై ఫలవంతమైన చర్చకు అవకాశం ఉంటుందని వివేకానంద అన్నారు. ప్రభుత్వం రాత్రి ఒంటి గంటలకు సభ్యులకు ఎజెండా కాపీలను పంపడం మానుకుని, సభను పద్ధతిగా నడుపాలని ఆయన హితవు పలికారు.

