త్వరలోనే వందేభారత్‌ స్లీపర్‌ తొలికూత

` కోల్‌కతా` గువాహటిల మధ్య పరుగులు
` ప్రకటించిన రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌
న్యూఢల్లీి(జనంసాక్షి):సుదూర ప్రయాణాలు చేసే రైలు ప్రయాణికులకు శుభవార్త. త్వరలోనే వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించి రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ గురువారం కీలక ప్రకటన చేశారు. తొలి రైలు కోల్‌కతా` గువాహటిల మధ్య అందుబాటులోకి రానుందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతులవిూదుగా త్వరలో ప్రారంభం కానుందని చెప్పారు. పశ్చిమబెంగాల్‌` అస్సాం మధ్య నడిచే ఈ రైల్లోని టికెట్‌ ధరలు.. విమాన టికెట్‌ ధరల కంటే తక్కువే ఉంటాయని చెప్పారు. ఈ మేరకు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రాబోయే 15`20 రోజుల్లో ఈ రైలు అందుబాటులోకి రానుందని అశ్విని వైష్ణవ్‌ చెప్పారు. జనవరి 18`19 తేదీల్లో ఈ ప్రారంభోత్సవం ఉండొచ్చని పేర్కొన్నారు. రైలు ప్రారంభోత్సవం గురించి ప్రధాని మోదీకి తెలియజేశామని చెప్పారు. రాబోయే 2`3 రోజుల్లో ప్రారంభోత్సవ తేదీ వివరాలను ప్రకటిస్తానని తెలిపారు. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య విమాన ప్రయాణానికి రూ.6 వేలు నుంచి 8 వేలు ఖర్చవుతోందని వైష్ణవ్‌ అన్నారు. వందేభారత్‌ స్లీపర్‌లో 3 ఏసీలో టికెట్‌ ధర (ఆహారంతో కలిపి) సుమారు రూ.2,300, 2ఏసీ ధర సుమారు రూ.3 వేలు, 1ఏసీ ధర సుమారు రూ.3,600 ఉండొచ్చని తెలిపారు. మధ్యతరగతిని దృష్టిలోపెట్టుకొని టికెట్‌ ధరలు నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ఏడాదిలో అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు జరగనున్నాయి.మరోవైపు వందేభారత్‌ స్లీపర్‌ రైలు గంటకు 180 కి.విూ. గరిష్ఠ వేగాన్ని సాధించగలిగింది. రైల్వే భద్రత కమిషనర్‌ (సీఆర్‌ఎస్‌) సమక్షంలో కోటా (రాజస్థాన్‌) నుంచి నాగ్దా (మధ్యప్రదేశ్‌) మధ్య తుది పరీక్షలను నిర్వహించగా ఈ వేగాన్ని చేరుకుంది. గాజు గ్లాసుల్లో నీళ్లు నింపి ఒకదానిపై ఒకటిగా ఈ రైలింజిన్లో ఉంచినా.. గరిష్ఠ వేగాన్ని చేరుకున్నప్పుడు కూడా ఏమాత్రం తొణకకపోవడాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ రైల్లో 16 పెట్టెలు ఉన్నాయి. వీటిలో ఆకర్షణీయమైన (ఏసీ) స్లీపర్‌ బెర్తులు, అధునాతన సస్పెన్షన్‌ వ్యవస్థ, ఆధునిక మరుగుదొడ్లు, నిప్పును గుర్తించే వ్యవస్థలు, సీసీటీవీ నిఘా వంటివి ఉంటాయి.
వందేభారత్‌ స్లీపర్‌ ఏ 180 కి.విూ.
దేశీయంగా రూపొందించిన వందేభారత్‌ స్లీపర్‌ రైలు గంటకు 180 కి.విూ. గరిష్ఠ వేగాన్ని సాధించగలిగింది. రైల్వే భద్రత కమిషనర్‌ (సీఆర్‌ఎస్‌) సమక్షంలో దీనికి సంబంధించిన తుది పరీక్షలను బుధవారం నిర్వహించారు. కోటా (రాజస్థాన్‌) నుంచి నాగ్దా (మధ్యప్రదేశ్‌) మధ్య ఈ వేగాన్ని చేరుకోవడం ద్వారా మరో మైలురాయిని అధిగమించినట్లయిందని రైల్వే మంత్రిత్వశాఖ పేర్కొంది. గాజుగ్లాసుల్లో నీళ్లు నింపి ఒకదానిపై ఒకటిగా ఈ రైలింజిన్లో ఉంచినా.. గరిష్ఠ వేగాన్ని చేరుకున్నప్పుడు కూడా ఏమాత్రం తొణక్కపోవడాన్ని వీడియో తీశారు. దీనిని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. రైలు గమనంలో స్థిరత్వం, కుదుపులు, ప్రకంపనలు, బ్రేకుల పనితీరు, భద్రత ప్రమాణాలు వంటివన్నీ పరీక్షించారు. రైలు పనితీరు సంతృప్తికరంగా ఉందని, ప్రయోగపరీక్ష విజయవంతమైనట్లు సీఆర్‌ఎస్‌ ప్రకటించారని రైల్వేశాఖ తెలిపింది. రైల్లో 16 పెట్టెలు ఉన్నాయి. వీటిలో ఆకర్షణీయమైన (ఏసీ) స్లీపర్‌ బెర్తులు, అధునాతన సస్పెన్షన్‌ వ్యవస్థ, ఆధునిక మరుగుదొడ్లు, నిప్పును గుర్తించే వ్యవస్థలు, సీసీటీవీ నిఘా వంటివి ఉంటాయి. ప్రయాణికులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఈ రైళ్లను ఎప్పటినుంచి ప్రవేశపెట్టబోయేదీ ప్రకటించలేదు. సీఆర్‌ఎస్‌ అనుమతితో దీనికి మార్గం సుగమం అయిందని మాత్రం రైల్వేశాఖ పేర్కొంది.