మాలపాడు ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

సదాశివపేట జనవరి 2(జనం సాక్షి)సదాశివపేట మండల పరిధి మాలపాడు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ సంతోష్ గౌడ్ హాజరై విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు, పాఠశాల ఉపాధ్యాయులు,గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు.



