రష్యా ఆక్రమిత ప్రాంతంలో డ్రోన్ దాడి..
` 24 మంది మృతి
కీవ్(జనంసాక్షి):కొత్త సంవత్సరం వేళ రష్యా ఆక్రమిత భూభాగంలో డ్రోన్ దాడి జరిగింది ఖేర్సన్ ప్రాంతంలోని ఖోర్లీ గ్రామంలో ఉన్న హోటల్, కేఫ్‌ను మూడు డ్రోన్లు తాకడంతో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ వివరాలను రష్యా ప్రభుత్వ అధికారులు వెల్లడిరచారు. ఉక్రెయిన్ దాడికి పాల్పడిన సమయంలో అక్కడి ప్రజలు న్యూఇయర్ వేడుకల్లో నిమగ్నమై ఉన్నారని చెప్పారు. ‘‘బుధవారం రాత్రి సమయంలో శత్రుదేశం ప్రయోగించిన మూడు డ్రోన్లు కేఫ్, హోటల్‌ను తాకాయి. అలాగే పలు ప్రాంతాల్లో ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. ఈ ఘటనలతో భద్రతాకారణాల దృష్ట్యా విమానాశ్రయాలను తాత్కాలిక మూసివేశాం’’ అని రష్యా అధికారులు వెల్లడిరచారు. ఇదిలా ఉంటే.. తమ అధ్యక్షుడు పుతిన్ వ్యక్తిగత నివాసంపై ఆదివారం రాత్రి, సోమవారం తెల్లవారుజామున డ్రోన్లతో దాడికి ఉక్రెయిన్ ప్రయత్నించిందని రష్యా వెల్లడిరచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఘటన వెలుగుచూసింది.

