కొత్త శక్తి, సానుకూల మార్పులకు ప్రతీక
` 2026 అందరికీ అద్భుతమైన సంవత్సరం కావాలి..
` రాష్ట్రపతి, ప్రధాని ఆకాంక్ష
న్యూఢల్లీి(జనంసాక్షి):పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త ఆశలతో ప్రపంచం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని మోదీ దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘నూతన సంవత్సరం సందర్భంగా దేశంలో, విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం కొత్త శక్తి, సానుకూల మార్పులకు ప్రతీక. ఆత్మపరిశీలనకు, కొత్త సంకల్పాలు తీసుకొనేందుకు మంచి అవకాశం. ఈ సందర్భంగా దేశాభివృద్ధి, సామాజిక సామరస్యం, పర్యావరణ పరిరక్షణపై మన నిబద్ధతను చాటుకుందాం. ఈ 2026 మనందరి జీవితాల్లో శాంతి, సంతోషం తీసుకురావాలని.. మరింత బలైమన, సుసంపన్నమైన భారత నిర్మాణానికి కొత్త శక్తిని నింపాలని ఆకాంక్షిస్తున్నా’అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ‘2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాది అందరికీ శాంతి, ఆరోగ్యం, ఆనందం శ్రేయస్సు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నా. బలమైన, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే మన సమష్టి సంకల్పాన్ని బలోపేతం చేయాలని కోరుకుంటున్నా’ అని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు.‘ఈ ఏడాది అందరికీ అద్భుతమైన సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను. 2026లో విూ అన్ని ప్రయత్నాలు విజయవంతం కావాలని.. మంచి ఆరోగ్యం, శ్రేయస్సు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నా. సమాజం శాంతి, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నా’ `ప్రధాని మోదీ



