రోషిణి డిగ్రీ కళాశాల

మంథనిరూరల్‌  జూన్‌ 13 (జనంసాక్షి): రోషిణి డిగ్రీ కళాశాల మంథని విద్యార్థులు డిగ్రీ వర్షిక ఫలితాల్లో అత్యత్తుమ ఫలితాలు సాధించారు. కాకతీయ యూనివర్శిటి వర్శిక ఫలితాల్లో మంథనిలోని రోషిణి డిగ్రీ కళాశాల విద్యార్థులు బిఎస్సీ(ఎంపీసీ) విభాగంలో అనుముల స్వప్న 1501, బిజెడ్‌సీ వి భాగంలో పైడాకుల నరేష్‌ 1409, బీకాం విభాగంలో కాసు చామంతి 1230 మార్కులు సాధించారు. వీరు కళాశాల అత్యుత్తమ మార్కులు సాధించినందుకు కళాశాల వ్యవస్థాపకులు రేపాల రమేష్‌, ప్రిన్స్‌ పాల్‌ రాజు, ఎవో శ్రీనివాస్‌, అధ్యాపకులు వీరిని అభినందించారు.