లండన్‌లో త్రివర్ణ పతాకం మెరిసేనా..
ఆశలూ రేపుతున్న షూటింగ్
లండన్ ఒలింపిక్స్‌కు ఇంకా ఆరు రోజులే మిగిలిందిజజ పతకాం వేటకు ప్రపంచ దేశాలన్నీ సిద్ధమయ్యాయి. భారత్ కూడా సమరానికి సై అంటోంది. ఈ పోటీల్లో ఇండియా కొంచెం వెనుకంజ వేసినప్పటికీ పతకాశాకాలను పూర్తిగా కొట్టి పారేయలేం బీజింగ్ ఒలిపింక్స్‌లో మూడు పతకాలతో సరిపెట్టుకున్న భారత్ క్రీడాసేన… ఈసారీ అంతకు మించిన ఫలితాలే సాధిస్తుందన్న ఆశలు కల్పిసుంది. ఇందుకు అనుగుణంగా విశ్వక్రీడా యవనికిపై భారత ప్రతిష్టను పెంచేందుకు 81 మంది అథ్లెట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకొని పోరుకు సిద్ధమయ్యారు. ఆరు రోజుల్లో ప్రారంభం కానున్న లండన్ ఒలిపింక్స్‌లో భారత్ మెడల్ ఛాన్సెస్‌పై ప్రథ్యక కథనం…
ఈ ఒలిపింక్స్‌లో భారత్ పై అంచనాలు పెరగడానికి ముఖ్య కారణం షూటింగ్ ఈ విభాగం నుంచి కనీసం ఒక్క పతకం వస్తుందన్న నమ్మకం అభిమానులకు కల్పిస్తున్నారు. భారత షూటర్లు బీజింగ్ స్వర్ణపతకం విజేత అభినవ్ వింద్రా, గగన్ నారంగ్, రంజణ్ సోధీలతో కూడిన ఇండియన్ షూటింగ్ టీమ్‌పై భారీ అంచానాలు ఉన్నాయి. లేటేస్ట్ ఆర్చరీ సేన్షేన్స్ దీపికా కుమారిపై ఎక్స్‌పెక్లేషన్స్ హైలెవల్‌కు చేరుకున్నాయి. షూటర్లు ఆర్చర్లే మేడల్ ట్యాలీలో మన ప్లేస్‌ను నిర్థాస్తారనడంలో సందేహం లేదు.
షూటింగ్ పూ భారీ అంచనాలు
గత ఒలిపింక్స్ అభినవ్ బింద్రా దేశానికిఇ స్వర్ణపతకం అందివ్వగా ఈసారీ అంతకు మించిన ఫలితాలే వస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 11 మంది సభ్యులు గల షూటింగ్ బృందంపై భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా అభినవ్ బింద్రా పై ఎక్స్‌పెక్టేషన్స్ హైలెవల్లో ఉండగా… హైదరాబాదీ గగన్‌నారంగ్, రంజన్ సోధీ కూడా సూపర్ ఫామ్‌లో ఉన్నారు. కామన్ వెల్త్ గేమ్స్‌తో పాటు వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో భారత షూటర్లు నిలకడగా సత్తా చాటుతున్నారు. 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్ వ్యక్తి గత విభాగంలో అభినవ్ బింద్రా, గగన్‌నారంగ్, పోటీ పడుతున్నారు. ఈ ఒక్క కేటగిరిలోనే గోల్ఫ్ సిల్వర్ రెండు పతకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక 100 మీటర్ల సెయిర్ కేటగిరిలో ఈ టాప్ షూటర్లు ఇద్దరూ ఒకే జట్టుగా బరిలోకి దిగుతున్నారు. దీంతో టీమ్ ఈ వెంట్‌లోనూ పతకంపై ఆశలు ఎక్కువగానే ఉన్నాయి. డబుల్ ట్రాప్ కేటగిరలో అంతర్జాతీయ వేదికపై నిలకడగా రాణిస్తోన్న రంజన్ సోధి కూడా సత్తా చాటితే భారత్ ఖాతాలో మరో పతకం కూడా చేరే చాన్సుంది. 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్ విభాగంలో విజయ్‌కుమార్‌పై ఆశలు పెట్టుకోవచ్చు కామన్ వెల్త్ ఏషియన్ గేమ్స్‌లో దేశానికి పతకాలు అందించిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో హినా సింధు అన్నురాజ్‌పైనా మెడల్ ఎక్స్‌పేక్టేషన్స్ ఉన్నాయి. మంచి ఫామ్‌తో నిలకడగా రాణిస్తోన్న ఇండియన్ షూటర్లు అంచనాలను అందుకుంటే మరిన్ని మెడల్స్ మన ఖాతాలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆర్చరీలోనూ ఛాన్స్?
అటు ఆర్చిరీలోనూ భారత్ పతకావకాశాలు మెండుగానే ఉన్నాయి. జార్ఖండ్ సంచలనం యువ ఆర్చర్ దీపికా కుమరిపై ఎక్స్ పేక్టేషన్స్ ఉన్నాయి. వరల్డ్ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్న దీపికా సామర్థ్యం మేరకు రాణిస్తే మహిళల వ్యక్తిగత విభాగంలో మనకు గోల్డ్‌మేడల్ గ్యారెంటీ అని చెప్పుకోవచ్చు. దీపికాతో పాటు బాంబేలా దేవి వ్యక్తిగత విభాగంలో మెడల్ రేసులో ఉంది. మహిళ రికర్వ్‌స కేటగిరిలోనూ భారత్‌కు పతకం వచ్చే అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయి. గత వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్న మహిళ రికర్వ్ టీమ్… ఒలిపిక్స్‌లోనూ పతకం దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు పురుషల ఆర్చరీ వ్యక్తిగత విభాగంలో అర్హత సాధించలేకపోయినప్పటికీ రికర్వ్ టీమ్ ఈ వెంట్‌లో మాత్రం ఇండియన్ ట్రయో క్వాలిఫై అయింది. గత ఏడాది కాలంగా గాడి తప్పిన భారత జట్టు తమ బెస్ట్ ఫామ్‌ను అందుకుంటే పురుషుల రికర్వ్ ఆశించవచ్చు. అయితే ఇంగ్లాండ్ వాతావరణం భారతకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. క్రికెట్‌లో దేశానికి వరల్డ్‌కప్ అందించి ఫేవరేట్ గ్రౌండ్‌గా మారిన చారిత్మ్రక లార్డ్స్ స్టేడియం ఒలిపింక్ ఆర్చరీ ఈ వెంట్‌లో ఎన్ని పతకాలు భారత్‌కు అందిస్తుందో చూడాలి..