లాటరీ ద్వారా పత్తి విత్తనాల పంపిణీి

కొడిమ్యాల, జూన్‌12 (జనంసాక్షి):

మండలంలోని సూరంపేట, కోనాపూ ర్‌, తిర్మలాపూర్‌, పోతారం, సండ్ర లపల్లె, దమ్మయ్యపేట, శనివారంపేట, రాంసాగర్‌, గ్రామాలలోని 136మంది రైతులకు మంగళవారం లాటరీ ద్వారా పత్తివిత్తనాలను అధికారులు పంపిణి చేశారు.ఈ కార్యక్రమాన్ని ఎంపిడిఓ వీరబుచ్చయ్య,తాహసిల్థార్‌ ఫరూఖ్‌ ప్రారంబించారు.ఎంపిడిఓమాట్లాడుతూ రైతులు గొడవలు పడకుండా ఉండాలని డ్రా పద్దతిని పెట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విఆర్‌ ఓలు,గ్రామపంచాయితి కార్యదర్శులు,ఎఇ లు,రైతులు పాల్గొన్నారు.