,లీగల్ కౌన్సిల్ కు దరఖాస్తుల ఆహ్వానం

నల్గొండ. జనం సాక్షి.నల్లగొండ, సూర్యపేట , భువనగిరిలలో ప్రజలకు న్యాయ సేవలు మరింత పటిష్టంగా అందచేయుటకు ఒక ప్రత్యేకమైన వ్యవస్థను లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ ఏర్పాటు చేయటానికి అర్హులైన న్యాయవాదులనుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్.నెం.1/2022 .విడుదలచేయడమైనదని, ఇట్టి నోటిఫికేషన్ http://districts.ecourts.gov.in/nalgonda, http://districts.ecourts.gov.in/yadadri & http://districts.ecourts.gov.in/nalgonda/suryapet డౌన్ లోడ్ చేసుకొని తేది:29.08.2022 సాయంత్రం 5.00 గం.ల లోపు దరఖాస్తులు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, నల్లగొండ కార్యాలయానికి అందచేయాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ , నల్లగొండ కార్యదర్శి జి. వేణు ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. తదుపరి ఆగస్ట్ 29 తర్వాత వచ్చిన వాటిని పరిగణనలోకి తీసుకోమని ఆయన తెలిపారు.