*లోన్ యాప్ నమ్మి మోసపోవద్దు
Ci ఖరిముల్లాఖాన్
దండేపల్లి. జనంసాక్షి.ఆగస్టు 23 ఆన్ లైన్ లోన్ యాప్ లను నమ్మి యువకులు మోసపోవద్దని లక్షెట్టిపేట సిఐ కరిముల్లా ఖాన్ దండేపల్లి ఎస్సై సాంబమూర్తి ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని పెద్ద పేట గ్రామంలో లోన్ యాప్ ల వల్ల కలిగే అనర్థాలపై యువకులకు అవగాహన కల్పించారు ఫోన్లకు వచ్చే మెసేజ్ లింకులను ఓపెన్ చేసి మోసగాళ్ల మాటలకు ఆకర్షితులై మోసపోవద్దని అన్నారు కొద్ది రోజుల క్రితం మామిడిపల్లి గ్రామానికి చెందిన బొమ్మిడి రాజేంద్రప్రసాద్ అనే యువకుడు లోన్ యాప్ వల్ల మృతి చెందాడని అన్నారు యువకులు లోన్ యాప్ లను నమ్మి జీవితాలను చిన్న భిన్నం చేసుకోవద్దని వాటివల్ల వచ్చే నష్టాలను యువకులకు వివరించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు