వన్‌టౌన్‌ ఎస్‌హెచ్‌వోగా శ్రీనివాస్‌రావు బాధ్యతలు స్వీకరణ

నిజామాబాద్‌, జూలై 20: హైదరాబాద్‌లోని అబిడ్స్‌ పరిధిలో సిఐగా విధులు నిర్వహిస్తున్న ఎ.శ్రీనివాస్‌రావు శుక్రవారం వన్‌టౌన్‌ ఎస్‌హెచ్‌వోగా బాధ్యతలు స్వీకరించారు. గత రెండు రోజుల కిందట మెదక్‌-నిజామాబాద్‌ జిల్లాల పరిధిలోని ఐదుగురు సిఐలను బదిలీ చేసిన విషయం తెలిసిందే. డిఐజి, డిఎస్పీలను కలిసి బాధ్యతలను స్వీకరించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రానున్న రంజాన్‌, వినాయకచవితి పండుగలను నగర ప్రజలు స్నేహభావంతో శాంతియుతంగా జరుపుకోవాలని ఆయన సూచించారు. వన్‌టౌన్‌ పరిధిలో ఎవరికైనా ఏ సమస్య వచ్చినా తాను అందుబాటులోనే ఉంటానని తెలిపారు. దీనికి అన్ని వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.ప్రజలు సహకరించినప్పుడే పోలీసులు ఏదైనా సాధించగలుగుతారని ఆయన పేర్కొన్నారు.