వరంగల్ ‘ నిట్ ‘లో విద్యార్థుల మధ్య ఘర్షణ
వరంగల్: జిల్లాలోని నిట్ క్యాంపస్‌లో జూనియర్లకు, సీనియర్లకు మధ్య జరిగిన ఘర్షణ ఆలస్యంగా వెలుగు చూసింది. నిన్న రాత్రి క్యాంపస్‌లోని ఆడిటోరియంలో చోటు చేసుకుంది. జూనియర్లను సీనియర్లు చితయకబాదారు. ఈ దాడిలో ఇద్దరు జూనియర్లకు తీవ్ర గాయాలయ్యాయి. దాడి చేసిన వారిలో నిట్ స్టూడెంట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు ఉన్నట్లు సమాచారం. సీనియర్లను మాత్రం నిట్ యజమాన్యం వెనకేసుకొస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్లపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు జూనియర్లు వెనుకంజ వేస్తున్నారు.