విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి కృషి అభినందనీయం.

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
పోటో: 1) అదనపు గదులు ప్రారంభిస్తున్న విద్యాశాఖ మంత్రి.
2) సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
బెల్లంపల్లి,సెప్టెంబర్23,(జనంసాక్షి)
విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె బెల్లంపల్లి పట్టణంలో ₹ కోటి 35 లక్షల రూపాయల డిఎంఎఫ్ టి నిధులతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలికల వసతి గృహం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా హాజరై భవనాన్ని ప్రారంభించి అనంతరం ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి విజన్ ఉన్న నాయకుడని పొగిడారు. విద్యా అభివృద్ధికై మన ఊరు-మన బడి కార్యక్రమం ప్రారంభించారని, ఈకార్యక్రమం ద్వారా ప్రయివేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వివరించారు. అంతే కాకుండా నిరుద్యోగులకు శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు. అనంతరం మండల లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కార్డులు, బతుకమ్మ చీరలు, కళ్యాణలక్ష్మి మరియు షాదీముభారఖ్ చెక్కులను అందచేశారు. ఈకార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, గౌరవ ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీ కూర రఘోత్తం రెడ్డి, తెలంగాణ రాష్ట్ర టీఎస్ఈడబ్ల్యూఐడిసి చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతీ హోళీకెరీ, డిఆర్డీఓ శేషాద్రి, ఎస్సి కార్పొరేషన్ ఈడీ దుర్గా ప్రసాద్, ఆర్డీవో శ్యామల దేవి, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, జిల్లా గ్రంధాలయ చైర్మన్ ప్రవీణ్, బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్, వైస్ చైర్మన్ సుదర్శన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రాణి-సురేష్, మండల ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, టీఆరెస్, టీఆరెస్వై, టీఆరెస్వి నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.