విద్యార్థులకు కరాటే ఛాంపియన్‌ షిప్‌

ఖమ్మం, అక్టోబర్‌ 18 : ఈ నెల 13, 14, 15 తేదీల్లో వరంగల్‌, నారాయణపురంలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ నిర్వహించిన అండర్‌-19 జూనియర్‌ కళాశాలల రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో ఖమ్మం విద్యార్థులు ఛాంపియన్‌ షిప్‌ కైవసం చేసుకున్నారు. వీరిలో గాయత్రీ (ఎస్‌ఎన్‌ మూర్తి కళాశాల) వై. ఏసు,   యాసిన్లు జాతీయ కరాటే పోటీలకు అర్హత సాధించగా లోటస్‌ కాలేజీలో చదువుతున్న నిరంజన్‌ ద్వితీయస్థానం, ప్రవీణ్‌కుమార్‌, వినోద్‌ మూడవ స్థానం  సంపాదించారు. విద్యార్థులను ఈ సందర్భంగా డిప్యూటీ డిఇఓ రత్నాకర్‌, శాంతిసుగుణ, వెంకన్న, సంపత్‌, కాశి, సయ్యద్‌, నరేష్‌ తదితరులు అభినందించారు. డిసెంబర్‌ నెలలో మధ్యప్రదేశ్‌లో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో విద్యార్థులు పాల్గొనడం ఆనందదాయమని కోచ్‌ కాశిం తెలిపారు.