*విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో రాణించాలి*
*జిల్లా పరిషత్ చైర్మన్ రాకాసి లోకనాథ్ రెడ్డి*
*గోపాల్ పేట్ జనం సాక్షి సెప్టెంబర్ (23):* విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లో రాణించాలని జిల్లా పరిషత్ చైర్మన్ రాకాసి లోకనాథ్ రెడ్డి అన్నారు శుక్రవారం ఆయన మండలంలోని బుద్ధారం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాన్ని సందర్శించారు ఈ నెల 25 నుండి 27వ తేదీ వరకు కళాశాలలో జరగనున్న జిల్లాస్థాయి ఆటల పోటీల ఏర్పాటు పనులను ఆయన పరిశీలించారు పనులు వేగవంతం చేయాలని ప్రిన్సిపాల్ ఆరోగ్యానికి సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలన్నారు ఆటల వల్ల శారీరక దారుఢ్యంతో మానసిక ఉల్లాసం లభిస్తుందన్నారు విద్యార్థులు క్రీడల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయికి దిగాలన్నారు అనంతరం ఆయన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది పాల్గొన్నారు
Attachments area