విద్యుదాఘాతంతో ఒకరి మృతి

విజయనగరం, ఆగస్టు 3 : పట్టణంలోని కంటోన్మెంట్‌ వద్దగల గూడ్సుషెడ్‌లో శుక్రవారం ఉదయం జరిగిన విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు, మరొకరు గాయపడ్డారు. ఆగివున్న రైలుబోగీలపై ఆటలాడేందుకు వెళ్ళిన పాతదుప్పాడ గ్రామ నివాసి అనిరుధ్‌ (17) విద్యుత్‌ వైర్లు తాకడంతో షాక్‌కు గురై మృతి చెందాడు. అతని మిత్రుడు షేక్‌ మస్తాన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. వీరిద్దరు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్లు సమాచారం. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.