వినతి పత్రం ఇవ్వడానికి వస్తే మాపై తప్పుడు కేసులు.

కార్పెంటర్ సంఘం అధ్యక్షుడు ఇర్షాద్
తాండూరు సెప్టెంబర్ 23 (జనంసాక్షి)
కార్పెంటర్ సమస్యలపై వినతిపత్రం ఇవ్వడానికి వస్తే ఫారెస్ట్ రేంజ్ అధికారి మాపై తప్పుడు కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అని కార్పెంటర్ల సంఘం అధ్యక్షుడు ఇర్షాద్ ఆరోపించారు.శుక్రవారం తాండూరు పట్టణం తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం వినతి పత్రం ఇచ్చేందుకు అటవీశాఖ కార్యాలయానికి వెళితే మాపై తప్పుడు కేసులు మోపేందుకు ప్రయత్నిస్తున్నారని ఇది ఎంతవరకు సమంజసం అని అన్నారు. తాండూరు ప్రాంతంలో ప్రతినెలా ఒక షాపుకు పదివేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. తాండూరు ప్రాంతంలో సుమారు 55 వరకు షాపులు ఉన్నట్లు తెలిపారు. పదిమంది సిబ్బందితో వచ్చి షాపు వారిని బెదిరిస్తున్నారని అన్నారు. తాండూరు పట్టణంలో 18 నుంచి 12 వరకు కట్టెల మిషన్లు ఉన్నాయని వారి వద్ద సుమారు 200 మంది ఆసాములు ఉంటారని వారి నుండి ప్రతినెల 10 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. ఈ విషయమై ఉన్నతాధికారుల కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.ఈ సమావేశంలో కార్పెంటర్ల సంఘం మాజీ అధ్యక్షులు పులిందర్ చారి, సంగమేశ్వర్ పాండురంగ చారి ఇస్మాయిల్ కాలప్ప విష్ణు, ప్రభు శంకర్, తదితరులు పాల్గొన్నారు.