వినాయకుడు ప్రత్యేక పూజలు
ఖమ్మం కలెక్టరేట్ , ఆగస్టు 31(జనం సాక్షి)
ఖమ్మం 53వ డివిజన్ పాత రామాలయం ఫ్రీడం పార్కు నందు ఏర్పాటుచేసినటువంటి వినాయక మండపం వద్ద విగ్నేశ్వర స్వామి కి టిఆర్ఎస్ నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు 53వ డివిజన్ కార్పొరేటర్ శ్రీవిద్య దంపతులు పీటల మీద కూర్చొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా టిఆర్ఎస్ నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు మాట్లాడుతూ ఈ పండుగలో మట్టితో చేసిన వినాయకుని ప్రతిమ ఇంటింటా పాలవెల్లి క్రింద మంటపంలో ప్రతిష్ఠించి అనేక రకాల పత్రితోను పూలతోను పూజ చేయడం ఉండ్రాళ్ళు , పాలతేలికలు , పప్పులో ఉండ్రాళ్ళు , కుడుములు వంటి పదార్ధాల నివేదన చేస్తారని, ఖమ్మం ప్రజలకు పాడిపంటలు,వ్యాపారాలలో, సుఖశాంతులతో జీవించేలా ఏకదంతుని దీవెనలు అందాలని కోరారు. సకల శాస్త్రాలకు అధిపతిగా బుద్ధిని సిద్ధిని ప్రసాదించాలని విఘ్నాలు తొలగి అందరికీ శుభం కలగాలని ఏకదంతుణ్ణి ప్రార్థించారు. ప్రకృతి పరిరక్షణకు మట్టి విగ్రహాలని ఉపయోగించి మానవాళి మనుగడకు తమ వంతు సహాయ సహకారాలు అందించే క్రమంలో భావితరాల వారికి స్వచ్ఛమైన ప్రకృతిని అందించే దిశగా మట్టి గణపతులను అందరూ ఉపయోగించాలని కోరారు ఆయన అన్నారు.