విషజ్వరంతో వృద్దురాలి మృతి

చౌటుప్పల్‌: విష జ్వరంతో చౌటుప్పల్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఉదయం సంస్థాన్‌ నారాయణపురం మండలం జనగాం గ్రామానికి చెందిన మంచాల రాములమ్మ(50) మృతి చెందింది. రాములమ్మ గత 3రోజులుగా విషజ్వరంతో బాధపడుతుంది. సోమవారం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.