*వీఆర్ఏల నిరవధిక సమ్మె 28వ రోజు*
పెద్దేముల్ ఆగస్టు 21(జనం సాక్షి)
రాష్ట్ర విఆర్ఏల జేఏసీ పిలుపు మేరకు విఆర్ఎ ల సమ్మె ఆదివారానికి 28వ రోజుకు చేరుకుంది. ఇన్ని రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడం హాస్యాస్పదంగా ఉందని పెద్దేముల్ మండల వీఆర్ఏలు పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే సమ్మె ఇంకా ఉదృతం చేసి ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించేలా చేస్తామని వీఆర్ఏలు పేర్కొన్నారు.