వీఆర్ఏ సమ్మె కు మీసేవ నిర్వాహకులు మద్దతు……

ఆలేరు. జనం సాక్షి

 

ఆలేరు పట్టణ కేంద్రంలో వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో తమ పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేయాలని తహసీల్దార్ కార్యాలయం ముందు , 31 వ రోజున జరిగే నిరవధిక సమ్మెకు ఆలేరు మీ సేవా నిర్వాహకులు చిక్క శ్రవణ్, బోడ బోయిన స్వామి బుధవారం న సంఘీభావము తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ. 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని , రిటైరైన వీఆర్ఏలకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని , ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను త్వరగా నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో మీ సేవా నిర్యాహకులు మహమ్మద్ అబ్దుల్ నహీం ఆలేరు మండల వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు రాస ముల్ల సంతోష్, ప్రధాన కార్యదర్శి బొమ్మల శ్రీనివాస్ , సహాయ కార్యదర్శి కాసర్ల సురేష్, కార్తీక్, శ్రీనివాస్, లక్ష్మి సంపత్ తదితరులు పాల్గొన్నారు.