వెస్టిండీస్‌పై పసికూన ఐర్లాండ్ సంచలన విజయం
హైదరాబాద్: 2015 క్రికెట్ ప్రపంచకప్‌లో పసికూనల సంచలనానికి బీజం పడింది. సోమవారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్ 4 వికెట్ల తేడాతో గెలుపొంది తమను తక్కువ అంచనా వేయొద్దని గ్రూపులోని ప్రత్యర్థులకు హెచ్చరిక పంపింది. పాల్ స్టిర్లింగ్ 92(84), జాయీసీ 84(67), నెల్ ఒబ్రియాన్79ళి(60)లు రాణించడంతో కరేబియన్ జట్టు నిర్దేశించిన 305 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 25 బంతులు ఉండగానే ఐరిష్ బృందం ా’ాదించింది. లక్ష్యం భారీగా ఉన్నా ఐర్లాండ్ జట్టు ఆది నుంచే దూకుడుగా ఆడుతూ వికెట్ కోల్పోకుండా ఇన్నింగ్స్‌ను నిర్మించింది. ఓపెనర్లు పోర్టర్‌ఫీల్డ్, స్టిర్లింగ్లు సంయమనంతో ఆడారు. వీరి జోడిని విడదీయడానికి విండిస్ కెప్టెన్ ¬ల్డర్ అన్ని ప్రయోగాలు చేశాడు. చివరి గేల్‌కు బంతి అప్పగించడంతో 71 పరుగుల వద్ద ఐర్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన పోర్టర్ ఫీల్డ్… రామ్‌దిన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
వెస్టిండీస్‌ను ముంచిన భాగస్వామ్యాలు
క్రీజులోకి వచ్చిన జాయీసీతో కలిసి స్టిర్లింగ్ చక్కని ఇన్నింగ్ ఆడాడు. వెస్టిండీస్ బౌలర్లు వీరి జోడిని నిలువరించలేక పోయారు. 92 పరుగులతో దూకుడుగా ఆడుతున్న స్టిర్లింగ్… శామ్యూల్స్ బౌలింగ్‌లో రామ్‌దిన్‌కు క్యాచ్ ఇవ్వడంతో 106 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఇక మ్యాచ్ మన చేతిలోకి వచ్చేసిందనుకున్న కరేబియన్ ఆటగాళ్లకు నిరాశే ఎదురైంది. జాయీసీకి నెల్ ఒబ్రియాన్ తోడవడంతో మరో చక్కని ఇన్నింగ్స్‌ను ఐరిష్ ఆటగాళ్లు ఆడారు. విండిస్ బౌలర్లకు ఈ జోడీ మరింత ప్రమాదకరంగా మారింది. ఈ సమయంలోనే ఐర్లాండ్ బ్యాటింగ్ పవర్‌ప్లే (36-40) తీసుకుని దూకుడు పెంచింది. 84 పరుగులతో విండిస్ బౌలింగ్‌ను చీల్చి చెండాడుతున్న జాయీసీని… టేలర్ పెవిలియన్‌కు పంపాడు. దీంతో 96 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. బ్యాటింగ్ పవర్‌ప్లేలో ఐరిష్ జట్టు కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 50 పరుగులు పిండుకుంది. అప్పటికి ఐర్లాండ్ మూడు వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. చివర్లో కొద్దిగా తడబడని ఐరిష్ ఆటగాళ్లు బల్బేర్నే 9, విల్సన్ 1, కెవిన్ ఒబ్రియాన్ల వికెట్లు కోల్పోయింది. అయితే మూనీ అండతో నెల్ ఒబ్రియాన్ లాంఛనాన్ని పూర్తి చేసి సంచలన విజయం నమోదు చేశాడు. విండిస్ బౌలర్లలో టేలర్ మూడు వికెట్లు తీయగా, గేల్, శామ్యూల్స్లకు చెరో వికెట్ దక్కింది.
తడబడి… నిలబడిన కరేబియన్లు
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ఆరంభించిన కరేబియన్ జట్టు ఐరిష్ బౌలర్ డాక్రెల్ ధాటికి తీవ్ర ఒడిదొడుకులకు లోనైంది. 87 పరుగులకే స్మిత్(18), గేల్(36), బ్రావో(0), సామ్యూల్స్(21), రాందిన్ (1) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన సిమన్స్, సామిలు జట్టును ఆదుకున్నారు. నెమ్మదిగా ఇన్నింగ్స్ మొదలుపెట్టి 40 ఓవర్ల తర్వాత జట్టు స్కోరు బోర్డును పరుగులెత్తించారు. ముఖ్యంగా సామి ఐర్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ బౌండరీలు బాదాడు. 89 పరుగులతో జోరు మీదున్న సామిని మూనీ ఔట్ చేశాడు. దీంతో 154 పరుగుల ఆరో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం వచ్చిన రసెల్‌తో కలిసి సిమన్స్ అదే వూపును కొనసాగించి సెంచరీ పూర్తి చేశాడు. 84 బంతుల్లో 102 పరుగులు చేసిన సిమన్స్.. సోరెసన్ బౌలింగ్‌లో డాక్రెల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రస్సెల్ 27, ¬ల్డర్ 0, పరుగులు చేశారు. ఐర్లాండ్ బౌలర్లలో డాక్రెల్ మూడు వికెట్లు తీయగా, మూనీ, సోరెసన్, కెవిన్ ఓబ్రియాన్ తలో వికెట్ తీశారు.